శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2017 (09:54 IST)

చైనాలో పీవీ సింధు అదుర్స్.. ఫైనల్లోకి ఎంట్రీ.. సైనా నెహ్వాల్ అవుట్..

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ చేరి.. రియో ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు రికార్డు సృష్టించింది. కాంస్య పతకాన్ని పక్కనబెట్టి.. బంగారు పతకాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ముచ్చటగా మూడో ప్రయత్నంలో పీవీ

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ చేరి.. రియో ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు రికార్డు సృష్టించింది. కాంస్య పతకాన్ని పక్కనబెట్టి.. బంగారు పతకాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ముచ్చటగా మూడో ప్రయత్నంలో పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరింది. చైనా గోడను బద్దలు కొట్టిన సింధు.. తొలిసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌ చేరి కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. 
 
సెమీఫైనల్ పోరులో సింధు 21-13, 21-10తో 9వ సీడ్‌ చెన్‌ యూఫీ (చైనా)పై విజయం సాధించింది. నువ్వానేనా అంటూ సాగిన ఈ పోరులో.. ఆద్యంతం ప్రత్యర్థి నుంచి ఎదురైన పోటీని సమర్థవంతంగా తిప్పికొట్టింది. తద్వారా సెమీఫైనల్లో గెలిచి.. ఫైనల్లోకి అడుగుపెట్టింది. 
 
అయితే వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో భాగంగా గ్లాస్గోలో జరుగుతున్న పోటీల్లో సెమీస్ వరకూ దూసుకొచ్చిన భారత ఏస్ షట్లర్లు సైనా నెహ్వాల్ చతికిలబడింది. గంటా 14 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్, వరల్డ్ నంబర్ 12 క్రీడాకారిణి, నోజోమి ఒకుహరా చేతిలో 12-21, 21-17, 21-10 తేడాతో ఓడిపోయింది. తద్వారా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.