శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:56 IST)

స్వీటీ స్వీటీ బ్రెడ్ జిలేబీ.. ఎలా చేయాలి..?

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ ముక్కలు - 4
చక్కెర - అరకప్పు
మంచినీళ్లు - అరకప్పు
యాలకుల పొడి - పావు స్పూన్
ఫుడ్ కలర్ - కొద్దిగా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్ ముక్కులను కుకీ కట్టర్‌తో గుండ్రని బిస్కెట్ ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో చక్కెర వేసి నీరు పోసి స్టవ్‌పై పెట్టాలి. ఈ మిశ్రమం కరిగే వరకు గరిటెతో తిప్పుతూ 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. 
 
స్టవ్‌పై బాణలి పెట్టి తగినంత నూనె వేసి వేడయ్యాక అందులో ముందుగా తయారుచేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి వేయించాలి. ఈ బ్రెడ్ ముక్కలను చక్కెర పాకంలో వేసి 5 నిమిషాల తర్వాత తీసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. అంతే స్వీటీ స్వీటీ బ్రెడ్ జిలేబి రెడీ.