బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (11:14 IST)

గుమ్మడితో బూరెలా.. ఎలా చేయాలంటే..?

కావలసిన పదార్థాలు:
తీపి గుమ్మడి తురుము - 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
యాలకుల పొడి - 1 స్పూన్
జీడిపప్పు - 1 స్పూన్
నెయ్యి - పావుకప్పు
మినపప్పు - 1 కప్పు
బియ్యం - 2 కప్పులు
ఉప్పు - చిటికెడు
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా మినపప్పు, బియ్యాన్ని కలిపి నాలుగు గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడి తురుమును శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి దానిపై బరువు పెట్టాలి. కాసేపటికి అందులో తడి పోతుంది. తరువాత స్టౌవ్ మీద బాణలి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి గుమ్మడి తురుము వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులో బెల్లం తురుము వేసి కలుపుకోవాలి. 
 
ఆ తరువాత ఆ మిశ్రమంలో యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు కలిపి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ పరిమాణంలో ఉండల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బిపెట్టుకున్న పిండిలో ఉప్పువేసి కలుపుకోవాలి. పూర్ణం ఉండల్ని ఒక్కోటి చొప్పున ఆ పిండిలో దిప్ చేసి నూనెలో వేసి వేయించి తీసుకుంటే.. టేస్టీ టేస్టీ గుమ్మడి బూరెలు రెడీ.