మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (12:42 IST)

రాగి కేక్ తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
రాగి పిండి - ముప్పావు కప్పు
గోధుమ పిండి - ముప్పావు కప్పు
బేకిండ్ పౌడర్ - 1 స్పూన్
సోడా - అరస్పూన్
ఉప్పు - కొద్దిగా
కోకో పొడి - 5 స్పూన్స్
బెల్లం పొడి - 1 కప్పు
కొబ్బరి పాలు - ముప్పావు కప్పు 
వెనిలా ఎసెన్స్ - 1 స్పూన్
బటరం - 150 మి.లీ.
పెరుగు - పావుకప్పు
కొబ్బరి పాలు - 1 కప్పు
చక్కెర - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందు కేక్ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఈ ప్యాన్‌ను 170 డిగ్రీల పాటు పావుగంటపాటు ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో రాగి పిండి, గోధుమ పిండి, బేకిండ్ పౌడర్, ఉప్పు, కోకో పొడి వేసి కలిపి రెండుసార్లు జల్లెడ పట్టాలి. ఆపై బెల్లం పొడి, ముప్పావు కప్పు కొబ్బరిపాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత బటర్, పెరుగు వేసి కలపాలి. 
 
ఇప్పుడు నెయ్యి రాసిన ప్యాన్‌లో ఈ మిశ్రమాన్ని పోసి అవెన్ సుమారు అరగంటపాటు అలానే ఉంచాలి. ఆపై బయటకు తీసి పావుగంటపాటు చల్లారనివ్వాలి. ఒక పాత్రలో పాలు, చక్కెర, కోకో పొడి వేసి స్టౌ మీద పెట్టి చక్కెర కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా మరిగిన తరువాత ఇందులో వెనిలా ఎసెన్స్ వేసి కలిపి కాసేపు ఉంచి దింపి చల్లారబెట్టాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత క్రీమ్‌గా తయారవుతుంది. ఆపై దీనిని కేక్ మీద పోసి చాకుతో సరిచేయాలి. అంతే... టేస్టీ టేస్టీ రాగి కేక్ రెడీ.