గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (11:47 IST)

సగ్గుబియ్యంతో లడ్డూలా.. ఎలా చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం - 1 కప్పు
పచ్చికొబ్బరి - అరకప్పు
చక్కెర - ముప్పావుకప్పు
నెయ్యి - 5 స్పూన్స్
జీడిపప్పు - కొద్దిగా
యాలకుల పొడి - చిటికెడు.
 
తయారీ విధానం:
ముందుగా సగ్గుబియ్యాన్ని బాణలిలో సన్నని మంటమీద వేయించుకోవాలి. అలాగే కొబ్బరి పొడిని కూడా కొద్దిగా వేయించాలి. ఇప్పుడు నెయ్యి వేడిచేసి అందులో జీడిపప్పు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత సగ్గుబియ్యాన్ని పొడిగా చేసుకుని అందులో పచ్చికొబ్బరి, జీడిపప్పు, యాలకుల పొడి కొద్దిగా నెయ్యి కలిపి లడ్డూల్లా చేసుకోవాలి. పొడిపొడిగా ఉండి లడ్డూలు చేసేందుకు వీలు కాకపోతే అందులో కొద్ది పాలు కలుపుకుంటే చాలు.. అంతే... సగ్గుబియ్యం లడ్డూలు రెడీ.