తెలంగాణ ఎన్నికలు : ఆ అసెంబ్లీ స్థానాల్లో ముగిసిన పోలింగ్

telangana poll
Last Updated: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (16:34 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. అయితే, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాలను సమస్యాత్మక స్థానాలుగా గుర్తించారు. ఈ స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

పోలింగ్ ముగిసిన స్థానాలను పరిశీలిస్తే, చెన్నూరు, సిర్పూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, అసిఫా బాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాలు ఉన్నాయి.

అయితే, పై స్థానాలకు చెందిన ఓటర్లు సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్న అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. కరీంనగర్ జిల్లా మంథని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు స్థానాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలు ఉన్నాయి.దీనిపై మరింత చదవండి :