బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (13:14 IST)

గుత్తా జ్వాలా ఓటు మాయం ... ట్విట్టర్‌ వేదికగా గగ్గోలు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా శుక్రవారం పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అయితే, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లింది. తీరా చూస్తే ఆమె ఓటు జాబితాలో లేదు. దీంతో తన ఓటు తీసేశారంటూ గగ్గోలు పెట్టింది.
 
తెలంగాణ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా, 'నేను సైతం' అంటూ ఓటు హక్కును వినియోగించుకోవాడానికి శుక్రవారం ఉదయం గుత్తా జ్వాలా పోలింగ్ బూత్‌కి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంతో ట్వీట్టర్ వేదికగా జ్వాలా తన నిరాశని వెలుబుచ్చుకున్నారు. 
 
తను ఆన్‌లైన్‌లో చూసినప్పుడు తన పేరు ఉందని. కానీ పోలింగ్ బూత్‌లో వెళ్లేసరికి తన పేరు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. ఎన్నికల సమయంలో ఓటర్లే కీలకం అటువంటింది ఓటర్ల పేర్లే జాబితాలో లేకపొవడం ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయంటూ ఆమె ప్రశ్నించారు.