ఒక్కటే చెపుతున్నా.. అక్క గెలవాలి.. సెల్ఫీలిస్తూ ఓటేసిన జూనియర్ ఎన్టీఆర్

jr ntr
Last Updated: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (11:06 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతితో కలిసి శుక్రవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూలులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లి, భార్యతో కలిసి వచ్చిన తారక్.. సాధారణ ఓటరుగా వరుసలో నిలబడి ఓటు వేశారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
jr ntr

ముఖ్యంగా, సాధారణ ఓటరులా క్యూలైన్‌లో నిలబడిన తారక్... అడిగిన వారికి సెల్ఫీలివ్వడం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. ఓటు వేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ, 'రాజ్యాంగం, దేశం మనకు కల్పించిన హక్కు ఇది. ఆ హక్కును అందరూ వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే ఫిర్యాదు చేసే హక్కు లేదు. ఓటు వేయాలనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు... మనసా, వాచా, కర్మణా మనకు అనిపించాలి. నేను చెప్పాల్సింది ఒక్కటే. అక్క గెలవాలని మాత్రం కోరుకుంటున్నా' అని అన్నారు.దీనిపై మరింత చదవండి :