తెలంగాణ ఎన్నికల పోలింగ్ స్పెషల్ ట్రైన్స్ : అర్థరాత్రి వరకు హైదరాబాద్‌ మెట్రో రైళ్ళు

hyderabad metro
Last Updated: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (09:34 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైళ్ళను శుక్రవారం అర్థరాత్రి వరకు నడుపనున్నారు. నిజానికి ప్రస్తుతం మూడు మార్గాల్లో ఆఖరి ట్రైన్ రాత్రి 10.30 గంటలకే. కానీ శుక్రవారం మాత్రం అర్థరాత్రి 11.30 గంటల వరకు నడుపనున్నారు.

పోలింగ్ సిబ్బందితో పాటు నగర ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా మెట్రో రైళ్ల సమయాన్ని ఒక గంట పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మూడు మార్గాల్లో చివరి ట్రైన్ 10.30 గంటలకు బయలుదేరుతుండగా శుక్రవారం మాత్రం నాగోల్, మియాపూర్, ఎల్బీ నగర్ మెట్రోస్టేషన్‌ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11.30 గంటలకు బయలుదేరుతుంది. ఇక అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ నుంచి చివరి రైలు రాత్రి 12.15 గంటలకు బయలు దేరుతుందని మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :