శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (16:24 IST)

వీణా వాణి ఆపరేషన్‌కు లండన్ వైద్యులు ఓకే.. టీ సర్కారు సమ్మతించేనా?

పుట్టుకతోనే అవిభక్త కవలలు జన్మించిన వీణా - వాణి ఆపరేషన్‌కు లండన్‌కు చెందిన వైద్య నిపుణులు సమ్మతించారు. అయితే, ఈ ఇద్దరు కవలలను వేరు చేసేందుకు పది నెలల సమయం పడుతుందని ఇందుకోసం రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చు అవుతుందంటూ హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి ఒక నివేదిక పంపించారు. 
 
పది నెలల పాటు తమ పర్యవేక్షణలోనే చిన్నారులు ఉంటారని చెప్పారు. వీణా - వాణిల రిపోర్టులను పరిశీలించిన తర్వాత వారిద్దరని వేరు చేయడం సాధ్యంమని తేలడంతో ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు ఆమోదం తెలిపారు. లండన్ డాక్టర్ల లేఖ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత వీణా - వాణిలతో పాటు తల్లిదండ్రులను కూడా లండన్‌కు పంపి, శస్త్ర చికిత్సను నిర్వహించనున్నారు.