శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (07:35 IST)

త్వరలో తెలంగాణకి 2 లేదా 3 వైద్య కళాశాలలు

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి పలు అంశాలపై వినతులు ఇచ్చామని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్​ వెల్లడించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆరోగ్య పథకాలు, అభివృద్ధిలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి పలు అంశాలపై వినతులు ఇచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రానికి 2 లేదా 3 వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరామని... కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు 2 క్యాన్సర్ రీజినల్ కేంద్రాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2 సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లు ఇవ్వాలని కోరామన్నారు.

రహదారుల వెంట ట్రామా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణలోని ఆరోగ్యశ్రీ కేంద్ర ఆయుష్మాన్ భారత్ కన్నా మెరుగ్గా ఉందని చెప్పామని మంత్రి తెలిపారు. ఆరోగ్య పథకాలు, అభివృద్ధిలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని ఈటల వెల్లడించారు.