శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 8 అక్టోబరు 2015 (12:41 IST)

గద్వాలలో నిన్న దొరికిన లంకె బిందె... తెరిచి చూసి షాక్... అందులో ఏముందంటే...?

గద్వాల పట్టణంలో బుధవారం పురాతనంగా ఉన్న బిందె ఒకటి బయటపడింది. దీంతో ఆ బిందెలో బంగారు, వెండి, వజ్రాలున్నాయని ప్రచారం జరిగింది. దాంతో ఆ బిందెను నిన్న తహశీల్దారు కార్యాలయంలో భద్రపరిచారు. పురావస్తు శాఖ అధికారుల సమక్షంలో ఇవాళ దానిని తెరిచి చూసినవారు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ఆ బిందెలో బురద, నీళ్లు తప్ప ఏమీ లభ్యం కాలేదు. దాంతో అంతా ఉసూరుమన్నారు.
 
గద్వాల పట్టణంలో తేరుమైదానం సమీపంలో పాత మహారాజ కూరగాయల మార్కెట్ కూల్చివేసి నూతన మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నూతన మార్కెట్ సమీపంలో మురుగు కాల్వను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారంనాడు ఈ కాల్వ కోసం జేసీబీతో తవ్వకాలు చేపడుతుండగా జేసీబీకి భారీ బిందె తగలడంతో దాన్ని బయటకు తీశారు.
 
క్షణాల్లోనే ఈ విషయం పట్టణమంతా వ్యాపించడంతో ఐదారవేల మంది ప్రజలు ఆ బిందెలో ఏముందో తెలుసుకునేందుకు వచ్చారు. దాంతో ఆ బిందెకు భద్రత కూడా కల్పించాల్సి వచ్చింది. తీరా దాన్ని తెరిచి చూస్తే మట్టి, నీళ్లు తప్ప ఏమీ లభ్యం కాలేదు.