Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భువనగిరిలో హాట్ కాలింగ్ : బూతు మాటలు మాట్లాడటమే ఉద్యోగం

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (12:14 IST)

Widgets Magazine
cell phone

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో హాట్ కాలింగ్ గుట్టురట్టయింది. ఉద్యోగం పేరుతో అందమైన అమ్మాయిలతో సెక్స్ గురించి బూతు మాటలు మాట్లాడించే ఇద్దరు సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లాకు చెందిన వీరేశం అనే వ్యక్తి భువనగిరి ప్రాంతానికి వచ్చి భవాని అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈమె సహాయంతో ఓ కాల్ సెంటర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత మంచి ఉద్యోగంతో పలువురు అమ్మాయిలను ఎంపిక చేసుకున్నాడు. 
 
వీరికి వివిధ రకాలుగా ఆశపెట్టి, కాల్ సెంటర్‌లో కూర్చుని మాట్లాడితే సరిపోతుందని నమ్మబలికి, ఆపై కస్టమర్లతో సెక్స్ సంభాషణలు చేయాలని ఒత్తిడి చేయసాగాడు. దీనిపై నిలదీస్తే తాను సంతకాలు పెట్టిన కాగితాలు చూపించి బెదిరింపులకు దిగుతూ వచ్చాడు. 
 
అయితే, కస్టమర్లతో బూతు మాట్లాడలేని ఓ యువతి ధైర్యం చేసి తనకు ఎదురైన అనుభవంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన గొంతు చాలా బాగుందని, కాల్ సెంటర్‌లో 20 వేల రూపాయలతో ఉద్యోగం ఇస్తామని చెబితే, ఆశపడి ఆ సెంటర్‌కు వెళ్లానని చెప్పింది. ఆపై అక్కడ అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు అసలు విషయం చెప్పగానే తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పింది.  
 
కస్టమర్లు తమ కాల్‌ను కట్ చేయకుండా ఎంత ఎక్కువ సేపు మాట్లాడితే అంత బాగా వారిని ఎంటర్‌టెయిన్ చేసినట్టని చెప్పేవారని, జీతంతో పాటు ఇంక్రిమెంట్లు ఇస్తామని ఆశ పెట్టారని బాధితురాలు చెప్పింది. తాను ఇమడలేక, ఆ విషయాన్ని తోటి ఉద్యోగినులకు చెబితే, అందరూ 'లైట్ తీస్కో'మని సలహా ఇచ్చారే తప్ప ఫిర్యాదు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదనీ చెప్పింది. 
 
దీనిపై భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసి కూపీలాగగా అసలు విషయం వెలుగు చూసింది. కాల్ సెంటర్‌పై దాడి చేసిన పోలీసులకు 12 మంది యువతులు ఫోన్ల ముందు కూర్చుని పట్టుబడ్డారు. ఈ కేసులో కాల్ సెంటర్ నిర్వాహకులు వీరేశం, భవానీలను అరెస్ట్ చేశామని తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉత్తరప్రదేశ్‌లో 40 మందికి హెచ్ఐవీ.. కారణమిదే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. ఏకంగా 40 మందికి హెచ్ఐవీ సోకింది. దీనికి కారణం ...

news

చంద్రగ్రహణ నరబలి : భార్య ఆరోగ్యం కోసం చిన్నారిని బలిచ్చాడు

ఇటీవల సంపూర్ణ చంద్రగ్రహణం రోజున హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన నరబలి కేసులోని మిస్టరీ ...

news

పకోడీలు అమ్ముకుంటే తప్పేంటి? రాజ్యసభలో అమిత్ షా

నిరుద్యోగంతో మిన్నకుండేకంటే.. పకోడీలు అమ్ముకోవడం మంచిదని.. అందులో సిగ్గుచేటు ఏముందని ...

news

ఎన్డీయే కూటమికి బీటలు... టీడీపీ తిరుగుబాటుతో బీజేపీ నేతల్లో గుబులు

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి బీటలు వారుతున్నట్టు కనిపిస్తోంది. వార్షిక ...

Widgets Magazine