Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చార్మినార్ ముందు చిన్న చెత్త కాగితాన్ని ఇక మీరు చూడలేరంతే...

గురువారం, 4 జనవరి 2018 (12:59 IST)

Widgets Magazine
charminar

హైదరాబాద్ పేరు వింటేనే మనకు గుర్తుకు వచ్చేది చార్మినార్. హైదరాబాద్ సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరూ చార్మినార్‌ను తప్పకుండా సందర్శిస్తారు. చార్మినార్‌ను కేంద్రం ఇటీవలే స్వచ్ఛ ఐకాన్‌గా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జీహెచ్ఎంసీ చార్మినార్ పరిసర ప్రాంతాలను సింగపూర్ తరహాలో మార్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
 
చార్మినార్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రతకు కేరాఫ్‌గా మార్చేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి దుకాణానికి రెండు చెత్త డబ్బాలను అందించి, తమతమ దుకాణాల ముందు చెత్త పడకుండా చూసే బాధ్యతను వారికే అప్పగించింది. ప్రతి అరగంటకోసారి చెత్త సేకరించబడుతుంది, అలాగే ప్రతి 20 నుండి 30 మంది వీధి వ్యాపారులకు ఒక పారిశుధ్య కార్మికుడిని పర్యవేక్షకుడిగా నియమించి, ఆయా ప్రాంతాల్లో రోడ్డుపైన చెత్త పడకుండా చూసే బాధ్యతను వారికి అప్పగించింది.
 
రోడ్లపై చిన్న కాగితం ముక్క కూడా లేకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు నలుగురు సీనియర్ అధికారులను కూడా నియమించింది. ఇదే కాకుండా అక్కడక్కడా పబ్లిక్ టాయ్‌లెట్లను ఏర్పాటు చేసి, వాటిని కూడా సక్రమంగా నిర్వహించే ఏర్పాట్లు చేయనుంది. చార్మినార్ సందర్శనకు వచ్చిన సందర్శకుల అభిప్రాయాన్ని కూడా సేకరించనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వీఆర్ఏను ట్రాక్టర్‌తో గుద్ది చంపేశారు.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. విలేజ్ రెవెన్యూ ...

news

ఫ్లైట్‌ను గాలికి వదిలేసి.. కాక్‌పిట్‌లో తన్నుకున్న పైలట్లు

కొందరు పైలట్లు క్షణికావేశానికి లోనవుతుంటారు. ఇలాంటివారి వల్ల విమాన ప్రయాణికులు ప్రాణాలు ...

news

"ఆ" లింకు పెట్టుకున్న యువకుడితో వివాహానికి సమ్మతించిన భర్త

సాధారణంగా వివాహమైన తర్వాత భార్యలు ఉండగానే భర్తలు రెండో వివాహం చేసుకోవడం చూస్తున్నాం. ...

news

జయలలిత శరీరంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలు...

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి ఓ మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించేందుకు జస్టీస్ ...

Widgets Magazine