శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : ఆదివారం, 5 జులై 2015 (10:07 IST)

కేసీఆర్ ఉద్యమం వల్లే సోనియా తెలంగాణా ఇచ్చారు : డీఎస్

ప్రత్యేక రాష్ట్రం కోసం తెరాస అధినేత కేసీఆర్ మహోధృతంగా ఉద్యమాన్ని నడపడం వల్లే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ పీసీసీ సభ్యుడు డి శ్రీనివాస్ అన్నారు. ఇదే అంశంపై ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ జిల్లా మహిళా నేత ఆకుల లలితకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలో తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, ఆమెకు టిక్కెట్ ఇచ్చే విషయాన్ని తనకు మాటమాత్రం కూడా చెప్పలేదని మండిపడ్డారు. అలాగే, తెరాసలో చేరేందుకు ఎలాంటి పదవులు ఆశించడం లేదన్నారు.
 
అదేసమయంలో సోనియా గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. పైగా, తెరాసలో చేరేందుకు తన వెంట రావాలని ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని, తన వెంట వచ్చేవారి బాగోగులు చూసుకుంటానని మాత్రమే హామీ ఇస్తున్నట్టు చెప్పారు. బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి నడుస్తానని డీఎస్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు.