హైదరాబాద్‌లోనూ బాణాసంచాపై ఆంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. అక్టోబరు 17 నుంచి 20వ తేదీ వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశ

firecrackers
pnr|
దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. అక్టోబరు 17 నుంచి 20వ తేదీ వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై బాణాసంచా పేల్చితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

పర్యావరణ పరిరక్షణ, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బాణాసంచా పేలుళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటున్నామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇప్పటికే ఢిల్లీలో టపాసుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నవంబర్ ఒకటో తేదీ వరకు తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెల్సిందే. నిషేధాన్ని సడలించాలని కోరుతూ అమ్మకందారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం ఎలాంటి సడలింపు ఇవ్వలేమని స్ప‌ష్టం చేసింది.దీనిపై మరింత చదవండి :