Widgets Magazine

హైదరాబాద్ మెట్రో రైల్ తొలి మహిళా డ్రైవర్ ఎవరో తెలుసా?

హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మెట్రో రైల్‌లో ప్రయాణించారు.

women metro driver
pnr| Last Updated: మంగళవారం, 28 నవంబరు 2017 (19:04 IST)
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మెట్రో రైల్‌లో ప్రయాణించారు. మియార్‌పూర్ నుంచి కూకట్‌పల్లి వరకు, కూకట్‌పల్లి నుంచి మియాపూర్‌ వరకు ఆయన ప్రయాణించారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, మెట్రో రైల్ ఉన్నతాధికారులు ఉన్నారు.

అయితే, ప్రధాని ప్రయాణించిన మెట్రో రైల్‌ను ఓ మహిళా డ్రైవర్ నడిపారు. ఆమె పేరు సుప్రియా సనమ్. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ మహిళా డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు మహిళా డ్రైవర్లు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఉన్నారు. సవాళ్ళతో కూడిన విధులను నిర్వహించేందుకు ఎంతో ఇష్టపడతానని, ప్రధాని ప్రయాణించిన మెట్రో రైల్‌ను తాను నడపేటపుడు ఎందో ఉద్వేగానికి లోనైనట్టు ఆమె చెప్పుకొచ్చింది.


దీనిపై మరింత చదవండి :