శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (10:47 IST)

ఆస్పత్రి గదిలో మద్యం తాపించి సామూహిక అత్యాచారం...

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెకు మద్యం తాగించిన నలుగురు యువకులు ఆమె స్పృహకోల్పోయిన తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
దీనిపై బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 
 
కాగా, బాధితురాలు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ దారుణం నిజామాబాద్ బస్టాండుకు సమీపంలోని ఓ ఆస్పత్రి గదిలో జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.