శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:25 IST)

సాగర్‌లో నీటి విడుదల తగ్గించాలి : కేసీఆర్‌కు గుత్తా లేఖ!

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అలాగే నాగార్జున సాగర్‌లో కూడా నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇలా నాగార్జున సాగర్‌లో కూడా నీటిని విడుదల చేయడం వల్ల నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతోపాటు నీటి నిల్వలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. 
 
ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో నీటి విడుదల తగ్గించాలని కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. రబీ పంటల కోసం నీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాని కోరారు. విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుతూ పోతే, ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు లేక ఎండిపోతాయని గుర్తు చేశారు.