చెప్పిన పార్టీకి భార్య ఓటేయలేదని.. చిటికెన వేలును తెగ్గోసిన భర్త

woman
Last Updated: శనివారం, 8 డిశెంబరు 2018 (15:30 IST)
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ శుక్రవారం పూర్తయిన నేపథ్యంలో తాను చెప్పిన పార్టీకి ఓటేయలేదని.. ఓ భర్త కత్తితో వెంటపడి మరీ వేలును నరికేశాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలంలోని సర్వాయిపేటలో వుంటున్న ఓ జంట ఎన్నికల సందర్భంగా ఓ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకుంది. ఓటింగ్ పూర్తయ్యాక తాను చెప్పిన పార్టీకి భార్య టేయలేదని తెలుసుకున్న భర్త కోపంతో ఊగిపోయాడు. 
 
తాను చెప్పిన పార్టీకి కాకుండా ఇంకో పార్టీకి ఓటేస్తావా అంటూ కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు చేతిని అడ్డంగా పెట్టడంతో ఆమె చిటికెన వేలు తెగింది. ఈ ఘటనలో గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :