శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (12:55 IST)

విడాకులివ్వకుంటే నెట్‌లో నగ్న ఫోటోలు పెడతా.. భార్యకు భర్త వార్నింగ్!

నేను కోరుకున్నట్టుగా విడాకులివ్వకుంటే నీ నగ్న ఫోటోలను ఇంటర్నెట్‌లో పెడతానంటూ కట్టుకున్న భార్యకు ఓ భర్త హెచ్చరించి కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
కొద్ది రోజుల క్రితం వివాహం జరిగిన ఈ జంట.. నెల రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత విడాకులిమ్మంటూ భార్యను నిత్యం వేధించడం ప్రారంభించాడు. విడాకులివ్వకపోతే, నీ నగ్న చిత్రాలను నెట్‌లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో ఖంగుతిన్న భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి భర్తను అరెస్టు చేసి జైలుకు పంపించారు.