Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెట్రో చార్జీలు ఇవే : కేసీఆర్.. శభాష్ అంటున్న భాగ్యనగరి వాసులు

బుధవారం, 29 నవంబరు 2017 (14:04 IST)

Widgets Magazine

భాగ్యనగర వాసులు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెట్రో రైల్ సేవలు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపారు. దీంతో హైదరాబాద్ నగరవాసుల సుదీర్ఘ కల నెరవేరింది.
hyd metro fares
 
మియాపూర్ - అమీర్‌పేట - నాగోలు మధ్య 30 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులను పైలాన్ ఆవిష్కరణ ద్వారా మోడీ లాంఛనంగా ప్రారంభించారు. సరిగ్గా మధ్యాహ్నం 2.30 గంటలకు మొదటి సిగ్నల్‌తో మెట్రోరైల్ తొలి కూత కూసింది. దేశంలో అత్యంతాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి.. తొలి దశలోనే 30 కిలోమీటర్ల ట్రాక్‌ను ప్రారంభించడం ద్వారా మన మెట్రో రికార్డు సృష్టించింది. 
 
మెట్రో ప్రారంభించిన అనంతరం తొలి రైలులో ప్రధాని మోడీతోపాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరి, రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ, మెట్రో అధికారులు ప్రయాణించారు. 
 
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రోరైల్ బుధవారం ఆరు గంటల నుంచి సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. నాగోల్ నుంచి అమీర్‌పేట మీదుగా మియాపూర్ వరకు ప్రయాణికులు ఈ ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవచ్చు. కనీస చార్జీని రూ.10గా, గరిష్ట చార్జీని రూ.60గా మెట్రో అధికారులు నిర్ణయించారు. 
 
ఈ చార్జీల నిర్ణయంపై భాగ్యనగరం వాసులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. చెన్నైలో కనిష్ట చార్జీ రూ.40గా ఉంటే, 
చెన్నై, బెంగుళూరు మెట్రో రైళ్లలో కూడా కనిష్ట చార్జీని రూ.40గా వసూలు చేస్తున్నారు. కానీ, హైదరాబాద్ మెట్రోలో మాత్రం కనీస చార్జీ కేవలం 10 రూపాయలే వసూలు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో వసూలు చేసే చార్జీల వివరాలను పరిశీలిస్తే, 
 
* రెండు కిలోమీటర్ల వరకు రూ.10
* నాలుగు కిలోమీటర్ల వరకు రూ.15
* ఆరు కిలోమీటర్ల వరకు రూ.25
* ఎనిమిది కిలోమీటర్ల వరకు రూ.30
* 10 కిలోమీటర్ల వరకు రూ.35
* 14 కిలోమీటర్ల వరకు రూ.40
* 18 కిలోమీటర్ల వరకు రూ.45
* 22 కిలోమీటర్ల వరకు రూ.50
* 26 కిలోమీటర్ల వరకు రూ.55
* 26 కిలోమీటర్లు దాటితే రూ.60గా వసూలు చేస్తారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిచ్చుపెట్టిన చైనా : భారత్ - పాక్‌ల మధ్య యుద్ధం తప్పదా?

ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది ...

news

ఇవాంకా... ఆ డ్రెస్ ఏంటీ... ఛాతీ వద్ద గౌనుకు ఆ రంధ్రం ఏంటీ?

ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశ పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడుకుంటోంది. ఆమె ...

news

ఎస్... అమెరికాలో ఎక్కడైనా బాంబు వేయగలం... కిమ్: ఉలిక్కిపడిన అమెరికా, జపాన్

పిచ్చివాడి చేతిలో రాయి వుంటే ఏమవుతుంది. ఆ రాయి ఎప్పుడు ఎవరి మీద విసిరివేస్తాడోనన్న భయంతో ...

news

సస్పెండ్ అయిన పోలీసు భార్యను ఫ్యామిలీ ఫ్రెండ్ అత్యాచారం చేశాడు

పోలీసును వివాహమాడిన మహిళకు భద్రత కరువైంది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్న ...

Widgets Magazine