Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గజల్ శ్రీనివాస్‌కు ఆ టైప్ మసాజ్... వీడియో క్లిప్పింగులు హల్చల్

బుధవారం, 3 జనవరి 2018 (10:16 IST)

Widgets Magazine
ghajal srinivas

గజల్ శ్రీనివాస్ చాలా మంచోడు... అంటూ చెప్పుకొచ్చిన ఓ మహిళ చేత గజల్ శ్రీనివాస్ చేయించుకున్న మరో టైపు మసాజ్ వీడియోలు ఇప్పుడు తెలుగు టీవీ ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. దీనితో గజల్ వ్యవహారం రచ్చరొచ్చుగా మారిపోయింది. నిన్నటివరకూ మా బాస్ చాలా మంచోండు అని చెప్పిన సదరు మహిళ కూడా ఆ క్రియలో పాల్గొన్నట్లు క్లిప్పింగుల్లో తేలడంతో గజల్ శ్రీనివాస్ కేసు మరింత బిగుసుకుపోయినట్లుగా కనిపిస్తోంది.
 
ఇకపోతే 'గజల్' కళాకారుడు గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేయడానికిగల కారణాలను హైదరాబాద్ పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ స్పష్టంచేశారు. ఆలయవాణి అనే వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తోన్న కుమారి అనే యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనను అరెస్టు చేసినట్టు తెలిపారు. 
 
"సేవ్ టెంపుల్ అనే ఆర్గనైజేషన్‌కు 'గజల్' శ్రీనివాస్ ప్రచారకర్తగా ఉన్నాడు. పంజాగుట్ట వెంకట రమణ కాలనీలో ఆ ఆఫీస్ ఉంది. ఆ ఆర్గనైజేషన్‌కు అనుబంధంగా గజల్ శ్రీనివాస్ ఆలయవాణి అనే వెబ్ రేడియోను నడిపిస్తున్నాడు. అందులో జాకీగా ఓ యువతి పనిచేస్తోంది.
 
ఆమె అంతకుముందు బాలవాణీ అనే రేడియోలో పనిచేసింది. రెండు నెలల నుంచి ఆమెను గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అన్ని ఆధారాలు ఉండటమతోనే అరెస్టు చేశాం. చాలా తీవ్రమైన కేసుగా పరిగణించవచ్చు. బాధితురాలి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు గురిచేశాడు అని పోలీసులు వ్యాఖ్యానించారు.
 
గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆధారాలతో సహా డిసెంబర్ చివరి వారంలో తమకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వేధింపులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఆలయవాణి వెబ్ రేడియో ఆఫీసులోనే కుమారిపై శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
 
బాధితురాలి ఫిర్యాదు తర్వాత ఆలయవాణి వెబ్ రేడియో ఆఫీసులో కూడా కొంతమంది ఉద్యోగులను విచారించామని తెలిపారు. అనంతరం పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం అరెస్టు చేశామని ఏసీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. గజల్ శ్రీనివాస్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. గజల్‌పై 354, 354ఏ, 509 సెక్షన్ ఐపీసీ కింద కేసులు నమోదు చేశామని ఏసీపీ విజయ్‌కుమార్ స్పష్టంచేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు.. ప్రధాన అర్చకుడిపై వేటు..

సుప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో అర్థరాత్రి పూజలు జరిపినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన ...

news

కన్నతల్లిని చంపేశాడు... ఎందుకో తెలుసా?

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కసాయి.. కన్నతల్లిని చంపేశాడు. కారణం ఏంటో తెలుసా? ...

news

ట్రిపుల్ తలాక్‌ గట్టెక్కేనా? నేడు రాజ్యసభకు...

వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ...

news

ప్లీజ్ పవన్.. తెలంగాణ నుంచి పోటీ చేయొద్దు.. ఎవరు?

తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలవడం హాట్ ...

Widgets Magazine