శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (19:22 IST)

నేనూ జైలు మనిషినే.. 18 నెలలు చంచల్‌గూడ జైలులో గడిపాను: నాయిని

తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తాను జైలు మనిషినేనని అన్నారు. తాను కూడా జైలు జీవితం గడిపానని చెప్పారు. చంచల్‌గూడ జైలును సోమవారం మంత్రి నాయిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల సమస్యలు తనకు కూడా తెలుసన్నారు. ఎమర్జెన్సీ కాలంలో 18 నెలలు చంచల్‌గూడ జైలులో జైలు జీవితం గడిపానని గుర్తు చేశారు.
 
తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా జైలుకు వెళ్లానని తెలిపారు. ముషీరాబాద్ జైలుకు సుమారు 50 నుంచి 60 సార్లు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. ఖైదీల్లో ప్రవర్తన మారే విధంగా జైళ్లు ఉండాలన్నారు. జైళ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ జైళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.
 
ఖైదీల్లో పరివర్తన తెచ్చేలా జైళ్లు ఉండాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. జైళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జీవితంలో తొందరపడి తప్పు చేసి జైలుకు వచ్చిన వారిలో మార్పు తీసుకురావాలన్నారు. జైళ్లకు ప్రత్యేక బడ్జెట్ ఇప్పిస్తానని హామీనిచ్చారు. దేశంలో కన్నా దక్షిణాదిన తమ రాష్ట్రం ముందుండేలా పని చేయాలని సూచించారు.