శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 3 మే 2016 (18:50 IST)

అంబర్ పేట్ మినీ స్విమ్మింగ్ పూల్ వద్ద పోకిరిలు... చర్యలు తీసుకోండి... జన సంక్షేమ సంఘం

అంబర్ పేటలోని మున్సిపల్ గ్రౌండులోని మినీ స్విమ్మింగ్ పూల్‌లో సమస్యల్ని పరిష్కరించాలని జన సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఇక్కడ సమస్యల గురించి సంఘం తెలుపుతూ... "యువత ఎక్కువగా వేసవిలో ఈతకొడుతున్నారు. ఈ క్రమంలో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఫినిషింగ్ షెడ్డు లేదు. మహిళలు ఈత కొడుతుంటే మరోపక్క పోకిరిలు పైనుంచి చూస్తున్నారు. దీనిపై జిహెచ్ఎంసి కమిషనర్ స్పందించి వెంటనే ప్రహరీ గోడ ఎత్తు పెంచి ప్లాస్టిక్ షెడ్డును ఏర్పాటు చేయాలి. మహిళలకు మగ కోచ్‌ను నియమించారు. వెంటనే మహిళా కోచ్‌ను నియమించాలి. మహిళా పోలీసులను రక్షణగా ఉంచాలి. 
 
పోకిరిలు సెల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించకుండా చూడాలి. దీనిపై జిహెచ్ఎంసి వారు పోలీసు శాఖ వారు వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము. మహిళల జనసంక్షేమ సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాము" అని తెలియజేస్తున్నారు.