శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Updated : బుధవారం, 30 జులై 2014 (21:12 IST)

కరీంనగర్ లో లేడి కిడ్నాపర్ అరెస్ట్

తల్లి పొత్తిళ్లలో నుండి శిశువును ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో చోటుచేసుకుంది. కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన స్రవంతి గత నాలుగు రోజులుగా జగిత్యాల లోని జయ నర్సింగ్ హోంలో పొత్తికడుపులో గుడ్డలు కుక్కుకుని తిరుగుతూ గర్భవతిగా అందరిని నమ్మించింది. 
 
కాగా ఇదే ఆసుపత్రిలో గత వారం రోజుల క్రితం జగిత్యాల చిలుకవాడకు చెందిన సంధ్య మగబిడ్డకు జన్మినిచ్చింది. గర్భవతిగా నమ్మిస్తూ తిరుగుతున్న స్రవంతి ఈ రోజు తెల్లవారు జామున అదును చూసి సంధ్య పక్కలో నుండి బాబును ఎత్తుకుని పరారయ్యింది. 
 
అయితే కొద్దిసేపటికే బాబు తన పక్కలో లేడని గమనించిన సంధ్య తన బంధువులకు సమాచారం అందించింది... దీంతో పట్టణంలో వెతకగా పాత బస్డాండ్ సమీపంలో స్రవంతి కనిపించడంతో ఆమె వద్ద నుంచి బాబును తీసుకుని ఆమెను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే మూడేళ్ల కొడుకును కలిగి ఉన్న స్రవంతి బాబును అమ్మేందుకే అపహరించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.