Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రైతుల కోసం దేశంలోనే మొదటిది అంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్

బుధవారం, 16 మే 2018 (14:58 IST)

Widgets Magazine

"సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వ్యవసాయ రంగం కుదుటపడుతున్నది. రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా కారణం వల్ల రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది కావద్దనే ఉద్దేశంతోని బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. చిన్నకారు, సన్నకారు, పెద్దరైతు అనే తేడా లేకుండా బీమా సౌకర్యం రైతులందరికీ వర్తింపచేయాలి. ఇందుకోసం రైతులందరూ సభ్యులుగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలి" అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
KCR

మరణించిన రైతుల కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై ప్రగతిభవన్‌లో మంగళవారం సిఎం సమీక్ష నిర్వహించారు. మరణించిన రైతు కుటుంబాలకు బీమా కల్పించే విషయంలో ఇన్సురెన్స్ కంపెనీలతో మాట్లాడి విధివిదానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
పథకం ఎలా అమలు చేయాలనే విషయంపై అధికారులు, బీమా సంస్థల ప్రతినిధులతో విపులంగా చర్చించారు. రైతుల తరుపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీని కోసం బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని చెప్పారు. రైతుల బీమా పథకం దేశంలోనే మొదటిది కావడంతో పాటు రైతులలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గోదావరిలో ఘోరం.. 45మంది గల్లంతు.. కిటికీలు మూతపెట్టడంతో మునిగిపోయిందా?

గోదావరిలో ఘోరం జరిగిపోయింది. గాలివాన దెబ్బకు లాంచీ నీట మునిగింది. దీంతో 30 అడుగుల లోతుకు ...

news

మా ఎమ్మెల్యే ఒక్కొక్కరికి భాజపా రూ.100 కోట్ల ఆఫర్... కుమారస్వామి ఆరోపణ

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇచ్చేందుకు భాజపా ఆఫర్ చేసిందని ...

news

షాక్... 12 మంది కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్... కనబడటంలేదట...

కర్నాటకలో ఎమ్మెల్యేలను అంటిపెట్టుకుని వుండాల్సిన పరిస్థితి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు ...

news

జేడీఎస్-కాంగ్రెస్ పొత్తుంటే కర్నాటకలో కమలం వాడిపోయేదా?

కన్నడ పీఠం కోసం అన్ని పార్టీలు పరీక్షనే ఎదుర్కొంటున్నాయి. అతి పెద్ద పార్టీగా బీజేపీ ...

Widgets Magazine