శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2016 (14:54 IST)

తెలంగాణకు ఇక చంద్రబాబు అవసరం లేదని తేల్చారు... తలసానికి ధైర్యం వచ్చింది...

వార్ వన్ సైడ్ అని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పినట్లే జరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో విపక్షాలను తెరాస మట్టికరిపించింది. అసలు ఒకటిఅరా సీటైనా వస్తుందో రాదో అన్న ఆందోళనలో విపక్షాలు కొట్టుమిట్టాడే స్థితికి చేర్చింది ఆ పార్టీ. కాగా తెరాస విజయంతో తెదేపా నుంచి తెరాసలోకి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. ఆయన ఎన్నికల విజయం తర్వాత మాట్లాడుతూ... చంద్రబాబు తెలంగాణకు అవసరం లేదని ప్రజలు పంపించేశారు. 
 
కాబట్టి ఇక ఆయన తెలంగాణ వచ్చినా తెదేపాకు ఓట్లు కానీ సీట్లు కానీ రావు. సుపరిపాలనను ప్రజలు ఆదరిస్తారనేందుకు తమ గెలుపే సూచిక అని చెప్పుకొచ్చారు. తను రాజీనామా చేసి ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమని ఇప్పుడు కాదు ఎప్పటినుంచో చెప్తునే ఉన్నానంటూ వెల్లడించారు. 
 
మొత్తమ్మీద గ్రేటర్ ఫలితాలు తలసానికి కొండంత ధైర్యాన్నిచ్చాయి. అందువల్లనే మంత్రి కేటీఆర్ వెంటరాగా తలసాని శనివారం నాడు హైదరాబాద్ బస్తీల్లో పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్నమాట.