Widgets Magazine

చంపించింది మా నాన్నే అయినా ఆయన్ను ఉరి తీయాల్సిందే... అమృత

శనివారం, 15 సెప్టెంబరు 2018 (13:49 IST)

మిర్యాలగూడలో నిన్న జరిగిన పరువు హత్య కేసులో పరారీలో వున్న అమృత తండ్రి మారుతీరావుతో పాటు ఆయన సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఈ హత్య తమ పనేనని వారు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాాయి. మరోవైపు ఆసుపత్రిలో వున్న అమృతను ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర నేతలు పరామర్శించారు. ఈ సందర్భంలో అమృత కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తను చూపించాలంటూ వేడుకుంది.
Pranay
 
తన తండ్రే తన భర్తను హత్య చేయిస్తాడని తను ఊహించలేకపోయాననీ, తన కళ్లెదుటే అత్యంత దారుణంగా నరికి చంపించిన తన తండ్రిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ప్రణయ్ కుటుంబ సభ్యులు మారుతీరావును కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేస్తున్నారు.
 
కాగా నిన్న ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యను హాస్పిటల్‌లో చూపించి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి తల్వార్‌తో దాడి చేసి ప్రణయ్‌ను హతమార్చాడు. మృతుడు ప్రణయ్ గత ఆరు నెలల క్రితం పట్టణంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకైక కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకొని ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా చేసాడు. పెండ్లి సమయంలోనే ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనగా పొలీస్ ఉన్నతాధికారుల జోక్యంతో అ సమస్య సద్దుమణిగింది. కాగా ప్రెగ్నెన్సీతో ఉన్న భార్య అమృతను స్థానిక జ్యోతి హాస్పటల్‌లో చూపించి తిరిగి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి తల్వార్‌తో దాడి చెయ్యడంతో ప్రణయ్ అక్కడిక్కడే మృతి చెందాడు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒకే కూతురు ఇలా చేసింది.. జీర్ణించుకోలేకే ప్రణయ్‌ని చంపేశాం: అమృత డాడీ

మిర్యాలగూడలో నడిరోడ్డుపై హత్యకు గురైన ప్రణయ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ...

news

చంద్రబాబు బీజేపీని నిందించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు: అమిత్ షా

ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కోర్టు ...

news

తనను పెళ్లాడేందుకు నిరాకరించిందని 38 సార్లు కత్తితో పొడిచి మీద ఎక్కి కూర్చున్నాడు...

ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైపోయింది. తనను ప్రేమించాలంటూ వెంటబడి వేధించిన ఆ ...

news

ప్రణయ్‌కి రూ.3కోట్ల ఆఫర్.. వద్దని అమృతను పెళ్లి చేసుకున్నాడు.. అందుకే?

దళిత యువకుడు ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ప్రణయ్ కోసం ఇంటిని ...

Widgets Magazine