సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (14:29 IST)

మోకాళ్ల పర్వతం ఎక్కి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటా.... మోత్కుపల్లి

ఆలేరులో మోత్కుపల్లి ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభ నుండి చంద్రబాబుని ఉతికి ఆరేసారు మోత్కుపల్లి నర్సింహులు. ఆవేశంగా మాట్లాడుతూ చంద్రబాబు చేయని తప్పుకు నన్ను బయటికి పంపారంటూ కంటతడి పెట్టుకున్నారు. అవసరం కోసం వాడుకొని వదిలేసే దాంట్లో చంద్రబాబుని మించినవార

ఆలేరులో మోత్కుపల్లి ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభ నుండి చంద్రబాబుని ఉతికి ఆరేసారు మోత్కుపల్లి నర్సింహులు. ఆవేశంగా మాట్లాడుతూ చంద్రబాబు చేయని తప్పుకు నన్ను బయటికి పంపారంటూ కంటతడి పెట్టుకున్నారు. అవసరం కోసం వాడుకొని వదిలేసే దాంట్లో చంద్రబాబుని మించినవారు ఈ భారతదేశంలో లేడని, జగన్, పవన్ కళ్యాణ్‌లు అసలైన లీడర్లని చంద్రబాబు మోసకారి అని విమర్శించారు.
 
ఎన్టీఆర్‌ని చంపి టీడీపీ జెండాని చంద్రబాబు దొంగిలించాడని తిరిగి ఆ జెండా ఎన్టీఆర్ కుటుంబానికి దక్కాలన్నారు. ఓటుకు నోటుతో టీడీపీ పరువు తీసిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు దొంగల్లా దొరికిపోయారని, ఇద్దరికి తగిన శిక్ష పడాలన్నారు. కేసీఆర్‌ని తిట్టమని చెప్పి చంద్రబాబు, కేసీఆర్‌తో కలుస్తాడు... నేను కలిస్తే తప్పా అని ప్రశ్నించారు. 
 
ఎన్టీఆర్ చనిపోయేటప్పుడు చంద్రబాబుని నమ్మవద్దని తనతో చెప్పాడని అయినా వినకుండా తాను మోసపోయానన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి పార్టీని ఆంద్రప్రదేశ్ ప్రజలు వంద ఫీట్ల బొందలో పెడతారన్నారు. మోకాళ్లు నెప్పులు ఉన్నా తిరుపతి నడచివెళ్లి చంద్రబాబు ఓడిపోవాలని  వెంకటేశ్వరస్వామిని మొక్కుకుంటానని తెలియజేశారు.