Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మావో అగ్రనేతల తల్లికి కలెక్టర్ పాదాభివందనం

శనివారం, 27 జనవరి 2018 (14:32 IST)

Widgets Magazine
peddapalli collector devasena

మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలుగా కొనసాగి, మూడు రాష్ట్రాలను గడగడలాడించిన నేతలు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్‌రావు. వీరి తల్లి మధురమ్మకు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన పాదాభివందనం చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జనవరి 26వ తేదీ జరిగిన గణతంత్ర వేడుకలు జరిగాయి.
 
ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. మధురమ్మ భర్త వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. ఆతను మరణించడంతో.. ఆయన స్థానంలో భార్య మధురమ్మను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. మధురమ్మకి పాదాభివందనం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. 
 
మధురమ్మ ఇద్దరు కుమారులు మల్లోజుల కోటేశ్వర్‌రావు, మల్లోజుల వేణుగోపాల్‌రావు మావోయిస్టు అగ్రనేతలు. కోటేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, వేణుగోపాల్‌రావు ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ కళ్యాణ్ సభలో అభిమాని హల్‌చల్ (వీడియో)

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన తొలిదశ తెలంగాణ యాత్రను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన ...

news

ఫేస్‌బుక్ పెళ్లా... ఎక్కువ రోజులు ఉండదు.. విడాకులు తీసుకోండి : హైకోర్టు

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై పెళ్లి చేసుకున్నారా? అయితే మీ కాపురం ఎక్కువ రోజులు కొనసాగదు. ...

news

నాకూ డోనాల్డ్ ట్రంప్‌కు అఫైర్ ఉందా : నిక్కీహేలీ ఏమంటున్నారు?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు, ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీకి ...

news

ఇండియన్ టెక్కీలకు డోనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. ఏంటది?

భారతీయ టెక్కీలకు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఓ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ...

Widgets Magazine