Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అల్లుడే కదా అని నమ్మివెళ్తే అత్తపై అత్యాచారం

శనివారం, 20 జనవరి 2018 (10:13 IST)

Widgets Magazine
rape

అల్లుడే కదా అన్ని నమ్మి వెళ్లిన ఓ అత్త అత్యాచారానికి గురైంది. తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు యేడాది క్రితం భర్త చనిపోయాడు. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి జీవిస్తూ కూలి పనులకు వెళ్తుండేది. ఇందులోభాగంగానే గురువారం ఇదే మండలం శేర్‌బందారం కూలి పని చేసేందుకు వెళ్లింది. పని పూర్తి కాగానే.. అదే గ్రామంలో అల్లుడు (కుమార్తె భర్త)కి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా అత్తపై అల్లుడు కన్నేశాడు. ఇదే అదునుగా భావించిన అల్లుడు బైక్ వేసుకుని పొలం వద్దకు వచ్చి అత్తను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత మార్గమధ్యంలో ఉన్న మహ్మద్‌షాపూర్‌ అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను లొంగదీసుకునేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో చావబాది రేప్ చేశాడు. 
 
అనంతరం ఆమెను సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి చేర్చాడు. అయితే జరిగిన విషయాన్ని కుమారులకు చెప్పిన ఆమె అదే రోజు రాత్రి దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని... ఎలా జరిగిందో తెలియదంటోంది...

సమాజం ఏ వైపు వెళుతుందో అర్థం కావడం లేదంటూ కవులు, రచయితలు చెబుతుంటారు. సమాజం మన చేయి దాటి ...

news

ఉప రాష్ట్రపతి షూలనే కొట్టేసిన దొంగలు... డొల్ల సెక్యూరిటీ అంటూ...

నిజంగా.. నవ్వు కోవాల్సిన సంఘటన ఇది. దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తికి ఎప్పుడూ జెడ్ ...

news

కత్తి మహేష్‌ మాటలకు ఓ లెక్కుందట.... ఆఁ... ఆఆఁ

కత్తి మహేష్. ఈ పేరు వింటేనే పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఒంటి కాలిపై లేచి నిలబడతారు. అభిమానులు ...

news

తెరాస గూటికి మోత్కుపల్లి నర్సింహులు...?

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన ...

Widgets Magazine