మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (09:18 IST)

బిర్యానీలో విషం కలుపుకుని తిని ప్రాణాలు విడిచారు...

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి యాదాద్రి జిల్లాలోని రాజాపేట మండలం పాముకుంటలో శుక్రవారం ఉదయం ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొత్తం కుటుంబంలోని ఏడుగురు చనిపోయారు.

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి యాదాద్రి జిల్లాలోని రాజాపేట మండలం పాముకుంటలో శుక్రవారం ఉదయం ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొత్తం కుటుంబంలోని ఏడుగురు చనిపోయారు. ఆ ఏడుగురు విషప్రయోగం వల్లే మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. 
 
ఘటనా స్థలంలో విషం సీసా కనిపించడంతో అన్నంలో విషం కలుపుకుని తిని కుటుంబం చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అసలు విషం తాగాల్సిన బాధ ఏమై ఉంటుందో వెల్లడి కావాల్సి ఉంది. 
 
సిద్దిపేట జిల్లా మునిగడప నుంచి బాధిత కుటుంబం యాదాద్రి జిల్లాకు వలసొచ్చింది. ఫౌల్ట్రీఫామ్‌లో కూలీలుగా పనికి కుదిరారు. ఊరి వారితో కలిసిమెలిసి ఉంటున్న ఈ కుటుంబ సభ్యులు ఇలా శవాలుగా కనిపించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల బాధతోనే ఇంటి పెద్ద ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది.