కాపురం చేసేందుకు రూ. 3 కోట్లు అడిగిందన్న భర్త, రూ.20 వేలు చెల్లించి ఇంట్లో వుండనివ్వండి...

గురువారం, 11 జనవరి 2018 (17:37 IST)

Sangeeta

బోడుప్పల్‌లో గత 53 రోజులుగా తనకు న్యాయం చేయాలంటూ తన భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుటే దీక్ష చేస్తున్న సంగీతకు కోర్టులో ఊరట లభించింది. ఆమె భర్తకు మియాపూర్‌ ఫ్యామిలీ కోర్టు అక్షింతలు వేస్తూ తీర్పునిచ్చింది. సంగీతకు ప్రతి నెల రూ. 20 వేలు చెల్లించడమే కాకుండా, ఆమెను గౌరవప్రదంగా ఇంట్లో వుండనివ్వాలని సూచన చేసింది. కాగా సంగీత ఇంతకుమునుపే కోర్టులో తన భర్త, అత్తమామలపై పిటీషన్ దాఖలు చేశారు. 
 
ఈ నేపధ్యంలో శ్రీనివాస్ రెడ్డి అరెస్టయి నిన్ననే బెయిల్ పైన బయటకు వచ్చాడు. తన భార్య తనతో కాపురం చేయాలంటే రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తోందనీ, తన ఆస్తినంతా ఆమెకు రాయమంటోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను, తన తల్లిదండ్రులను వేధిస్తోందంటూ రివర్స్ ఎటాక్ చేశాడు. దీనిపై సంగీత మాట్లాడుతూ... అతడు చెప్పేవన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. తను 3 కోట్లు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే తన కేసు వాపసు తీసుకుంటానని ఆమె వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ వీరాభిమాని బండ్ల గణేష్‌పై అట్రాసిటీ కేసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై ఎస్సీఎస్టీ ...

news

విందుకు పిలిచాడు.. కడుపు నిండా వడ్డించాడు.. ఐతే తొమ్మిది మంది మృతి?

బంధువుల ఇంటికి విందుకు వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బంధువు పిలిచాడని.. కడుపు నిండా ...

news

హైదరాబాద్ కార్పొరేటర్ నాగిని డ్యాన్స్ .. వీడియో వైరల్

హైదరాబాద్ నగర పాలక సంస్థకు చెందిన కొందరు కార్పొరేటర్లు తమ ధన, కండ, అండ బలాన్ని ...

news

ఉపరాష్ట్రపతిగా కాదు.. ఉషాపతిగానే వచ్చా.. పిచ్చిరాతలు వద్దు (వీడియో)

భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు ...