చెంబుతో శక్తి యోగం... బంగారం వేస్తే కష్టాలు పోతాయంటాడు... వేస్తేనా?

శుక్రవారం, 13 జులై 2018 (17:57 IST)

ఇంట్లో సమస్యలు తీరుస్తా... అందుకు మీ బంగారం అంత చెంబులో వేస్తే సమస్యలు తీరిపోతాయని అమాయకులను బురిడీ కొట్టిస్తున్న నకిలీ బాబాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈయన దగ్గర్నుంచి 1.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బాబా రామ శివ చైతన్యం స్వామిజీతో పాటు ఇతని భార్య తేజేస్విని ఇతనితో కలిసి పనిచేస్తున్న కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.
Fake-Baba
 
ఇతడు చేసేదల్లా... ఎవరైతే కష్టాల్లో వున్నారో వాళ్ల ఇంటి ముందు వాలిపోతాడు. అది కూడా మధ్యతరగతివారిని ఎంచుకుంటాడు. వారి కష్టాలను క్యాష్ చేసుకునేందుకు వారిని బాగా నమ్మిస్తాడు. ఆ తర్వాత మంచి రోజు చూసుకుని ఇంట్లో వున్న బంగారాన్నంతా చెంబులో వేయమంటాడు. కష్టాలు తీరాలంటే బంగారం చెంబులో వేయాల్సిందేనంటాడు. దాంతో వాళ్లు ఆ మాయబాబా మాటలు నమ్మి బంగారం వేసేస్తారు. అంతే... వాళ్ళ దృష్టిని మరల్చి బంగారం వున్న చెంబు స్థానంలో మామూలు చెంబు పెట్టేసి అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇతడి బాధితులు పెద్దఎత్తున వున్నట్లు చెపుతున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పరిపూర్ణానందపై నగర బహిష్కరణ వేటు వేస్తారా? : అమిత్ షా ఫైర్

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్ నగర పోలీసులు ఆర్నెల్లపాటు నగర ...

news

పవన్‌ కళ్యాణ్ కంటికి ఆపరేషన్... రేణూ ఆరా తీసిందా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ...

news

రమణ దీక్షితులకు షాకిచ్చిన కేంద్రం.. అక్కడే చర్చించుకోవాలని లేఖ..

అర్చకులకు 65 ఏళ్ల నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తీసుకురావడంతో శ్రీవారి ...

news

అప్పుడు సైకిళ్లకు పంక్చర్లు.. ఇప్పుడు రూ.150 కోట్ల ఆస్తులు.. ఎలా?

'ఇచ్చట సైకిళ్లకు పంక్చర్లు వేయబడును - సైకిళ్లు అద్దెకు ఇవ్వబడును' అనే బోర్డు పెట్టుకుని, ...