Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేవంత్ రెడ్డి రాజీనామాతో నల్గొండ టీడీపీ ఖాళీ...

ఆదివారం, 29 అక్టోబరు 2017 (15:33 IST)

Widgets Magazine
revanth reddy

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. రెడ్డి వర్గం నేతలు అత్యధికంగా ఉన్న పూర్వపు నల్గొండ జిల్లాలోని పలువురు నేతలు ఇప్పుడు రేవంత్ వెంట నడిచేందుకు సిద్దమవుతున్నారు. ఫలితంగా నల్గొండ జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది.
 
ముఖ్యంగా అధికారికంగా ఎవరి పేర్లూ బయటకు రాకపోయినా, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు చెందిన ప్రధాన నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు మినహా మిగతా వారంతా రేవంత్ వెంట వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సుమారు 25 మంది ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
ఈ జిల్లాల్లో పార్టీని నడిపిస్తున్న వారిలో దివంగత హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, పటేల్‌ రమేష్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యక్తులు. నర్సింహులు మినహా మిగతావారు రేవంత్‌ వెంట వెళితే, పార్టీకి పెను నష్టమే జరుగుతుంది. కంచర్ల భూపాల్‌ రెడ్డి, పటేల్‌ రమేష్‌ రెడ్డిలు టీడీపీని వీడనున్నారు. 
 
ఇదిలావుండగా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎందుకు మాట్లాడారో తెలియజేయాలని కోరుతూ నల్గొండ టీడీపీ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు అందాయి. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ నోటీసులను పంపుతూ, వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినందున క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేయాలని కోరారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పన్నీర్ సెల్వం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసొచ్చారట...

ఓ తమిళ మంత్రి తెలివితేటలు బయటపడ్డాయి. దిండుగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ...

news

కార్యకర్తలతో మాట్లాడి మీ ముందుకు వస్తా.. అర్థం చేసుకోండి: రేవంత్

తన వర్గానికి చెందిన కార్యకర్తలతో మాట్లాడి మీ ముందుకు వస్తానని, అంతవరకు తననేమీ అడగవొద్దని ...

news

ఆరేళ్ల బుడతడు... పైలట్‌గా విమానం నడిపాడు (వీడియో)

ఆ బుడతడి వయసు ఆరేళ్లు. కానీ, అలవోకగా విమానం నడిపాడు. పేరు అదామ్. అబుదాబి వాసి. చిన్నప్పటి ...

news

ఉంటారో.. పోతారో తేల్చుకోండి.. శివసేనకు సీఎం ఫడ్నవిస్ వార్నింగ్

మిత్రపక్షమైన శివసేనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ...

Widgets Magazine