తెలంగాణలో బిజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన హిరోయిన్

ReshmaRathore
శ్రీ| Last Updated: శుక్రవారం, 2 నవంబరు 2018 (20:38 IST)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో 28 మంది అభ్యర్థుల  పేర్లను ఖరారు చేసింది. రెండు విడతల్లో 66 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ... ఇంకా 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.  నిజామాబాద్ అర్బన్ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, రాజేంద్రనగర్ నుంచి బద్ధం బాల్‌రెడ్డి, మలక్ పేట్ నుంచి ఆలె జితేంద్ర, వరంగల్ పశ్చిమ నుంచి మాజీ ఎమ్మెల్యే ధర్మారావులకు చోటు దక్కింది. 
 
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నుంచి సినీ నటి రేష్మా రాథోడ్ బీజేపీ అవకాశం కల్పించింది. రేష్మా రాధోడ్ గతంతో పలు టీవీ చానెల్స్‌లో యాంకర్‌గా తరువాత సినిమాల్లో నటించింది. బీజేపీ రెండో విడత జాబితాలో చోటు దక్కించుకున్న వారి వివరాలు ఈ రకంగా ఉన్నాయి. 
 
 
 
1)సిర్పూర్‌ - డా.శ్రీనివాసులు
.
2) ఆసిఫాబాద్‌ - అజ్మీరా ఆత్మరామ్‌నాయక్‌
.
3) ఖానాపూర్‌ - సట్ల అశోక్‌.
4) నిర్మల్‌ - డా. సువర్ణారెడ్డి.
 
5) నిజామాబాద్‌ అర్బన్‌ - యెండల లక్ష్మీనారాయణ.
 
6)జగిత్యాల - ముదుగంటి రవీందర్‌రెడ్డి.
 
7) రామగుండం - బల్మూరి వనిత
.
8) సిరిసిల్ల - నర్సాగౌడ్‌.
 
9) సిద్దిపేట - నాయిని నరోత్తమ్‌రెడ్డి.
 
10) కూకట్‌పల్లి - మాధవరం కాంతారావు
.
11) రాజేంద్రనగర్‌ - బద్దం బాల్‌రెడ్డి
.
12) శేరిలింగంపల్లి - జి. యోగానంద్‌
.
13) మలక్‌పేట్‌ - ఆలె జితేంద్ర
.
14) చార్మినార్‌ - టి.ఉమామహేంద్ర
.
15) చంద్రాయణగుట్ట - సయ్యద్‌ సహేజాది.
 
16) యాకత్‌పురా - చర్మాని రూపరాజ్‌.
 
17) బహదూర్‌పురా - అనీఫ్‌అలీ.
 
18) దేవరకద్ర - అగ్గాని నరసింహులుసాగర్‌.
 
19) వనపర్తి - కొత్త అమరేందర్‌రెడ్డి
.
20) నాగర్‌కర్నూల్‌ - నేదనూరి దిలీప్‌చారి
.
21) నాగార్జునసాగర్‌ - కంకణాల నివేదిత
.
22) ఆలేరు - దొంతిరి శ్రీధర్‌రెడ్డి.
 
23) స్టేషన్‌ఘన్‌పూర్ - పెరుమాండ్ల వెంకటేశ్వర్లు
.
24) వరంగల్ వెస్ట్ - ఎం.ధర్మారావు.
 
25) వర్దన్నపేట - కొత్త సారంగరావు
.
26)ఇల్లందు - ఎం.నాగస్రవంతి
.
27) వైరా - భూక్య రేష్మాబాయి
.
28)అశ్వారావుపేట - డా.భూక్య ప్రసాదరావు.
 దీనిపై మరింత చదవండి :