మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (09:39 IST)

టీడీపీకి వందకు వంద శాతం అవకాశం ఉండేది : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రేవంత్ రెడ్డి మనసంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నట్టుగా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం గురించే ఆయన మాట్లాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టయితే ఆ పార్టీకి వందకు వందశాతం అవకాశం ఉండేదని వ్యాఖ్యానించారు.
 
రేవంత్ రెడ్డి ఓ టీవీతో మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబును చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విపరీతంగా భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబును టార్గెట్ చేసి పొత్తుల గురించి విమర్శిస్తున్నాడంటేనే కేసీఆర్ ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.
 
'కాంగ్రెస్ పార్టీలో ఎగిరెగిరి దంచినా అంతే కూలి.. ఎగరకుండా దంచినా అంతే కూలి' అని చమత్కరించారు. కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనుకునే వాళ్లకు అవకాశం ఉందని, అయితే, పార్టీలో ఎవరు ఎలా కావాలంటే అలా ఉండే స్వేచ్ఛ కూడా ఉందని అన్నారు. ఎదగాలనుకునే వాళ్లు ఎదగొచ్చని, పడిపోయేవాళ్లు పడిపోవచ్చని, నేర్చుకునే వాళ్లు నేర్చుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.