తెలంగాణలో 704 కేసులు.. ఐదుగురు మృతి
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 704 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 726 యాక్టివ్ కేసులుండగా..3,725 మంది మృతి చెందారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 77 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని..917 మంది డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6 లక్షల 16 వేల 769గా ఉంది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు..
ఆదిలాబాద్ 04. భద్రాద్రి కొత్తగూడెం 25. జీహెచ్ఎంసీ 77. జగిత్యాల 20. జనగామ 08. జయశంకర్ భూపాలపల్లి 12. జోగులాంబ గద్వాల 04. కామారెడ్డి 01. కరీంనగర్ 55. ఖమ్మం 44. కొమరం భీం ఆసిఫాబాద్ 05. మహబూబ్ నగర్ 10. మహబూబాబాద్ 22. మంచిర్యాల 46. మెదక్ 06. మేడ్చల్ మల్కాజ్ గిరి 28. ములుగు 16.
నాగర్ కర్నూలు 07. నల్గొండ 64. నారాయణపేట 00. నిర్మల్ 02 నిజామాబాద్ 06 పెద్దపల్లి 37. రాజన్న సిరిసిల్ల 25. రంగారెడ్డి 27. సంగారెడ్డి 12. సిద్దిపేట 22. సూర్యాపేట 27. వికారాబాద్ 05. వనపర్తి 06. వరంగల్ రూరల్ 17. వరంగల్ అర్బన్ 47. యాదాద్రి భువనగిరి 17. మొత్తం 704.