శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pyr
Last Modified: గురువారం, 5 మార్చి 2015 (06:44 IST)

12న తెలంగాణ ఎడ్‌సెట్.. కన్వీనర్ వెల్లడి

ఈ నెల 12 తెలంగాణ ఎడ్ సెట్-2015ను ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న తెలంగాణ ఎడ్‌సెట్-2015(టీఎస్‌ఎడ్‌సెట్)ను నిర్వహిస్తోంది. ఈ నెల 12న ప్రకటన విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ బుధవారం వెల్లడించారు.  
 
ఈ నెల 16 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి (2015-16) బీఈడీ కోర్సు కాలవ్యవధిని రెండేళ్లకు పొడిగించినట్లు తెలిపారు. బీటెక్, బీఈ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సైతం బీఈడీ చదివేందుకు అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. అర్హత గల అభ్యర్థులు (www.tsedcet.org ) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.