శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 30 నవంబరు 2016 (21:56 IST)

తెలంగాణ సీఎం కేసీఆర్ తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు... జైల్లో పెట్టాలి... రేవంత్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తాగి నడుపుతున్నారనీ, సహజంగా ఎవరైనా తాగి కారు నడిపినా, ద్విచక్ర వాహనం నడిపినా వారికి జరిమానాతోపాటు జైలు శి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తాగి నడుపుతున్నారనీ, సహజంగా ఎవరైనా తాగి కారు నడిపినా, ద్విచక్ర వాహనం నడిపినా వారికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తారనీ, అలాంటప్పుడు ఒక రాష్ట్రాన్నే తాగి నడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను అండమాన్ జైల్లో పెట్టాలా లేదా అని ప్రశ్నించారు. 
 
తెలంగాణ తెలుగుదేశం పార్టీ తలపెట్టిన పోరుయాత్ర నేటితో ముగియడంతో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో బహిరంగ సభ నిర్వహించారు. కేసీఆర్ రాత్రిపూట తాగిన మత్తులో ఓ నిర్ణయం తీసుకుంటారనీ, తెల్లారేసరికి మరో నిర్ణయం చెప్తారని వెల్లడించారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం మనం దురదృష్టమన్నారు. తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదనీ, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఇక్కడి బిడ్డల వల్ల, వారి ఆత్మ త్యాగాల వల్ల వచ్చిందన్నారు.
 
అక్కడ తెలంగాణ సై ఇక్కడ తెలంగాణ నై అని నినాదాలు చేసిన నకిలీ ఉద్యమకారులను మంత్రులుగా చేసి పక్కన కూర్చోబెట్టుకోవడం కేసీఆర్ కే చెల్లిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు నోరు మెదపడం లేదని విమర్శించారు.