బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (18:12 IST)

తెలంగాణలో విద్యా సంస్థలకు క్రిస్మస్ - సంక్రాంతి సెలవులు ఖరారు

govt school
తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. క్రిస్మస్ మిషనరీ స్కూళ్ళకు ఐదు రోజులు, మిగగా స్కూళ్లకు ఒక్క రోజే మంజూరు చేశారు. సంక్రాంతి ఆరు రోజులు సెలవు ప్రకటన ప్రకటించారు. దీపావళికి పండుగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది. 
 
డిసెంబరు నెలలో క్రిస్మస్ పండుగకు ఐదు రోజులు సెలవులు ప్రకటించింది. డిసెంబరు 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని తెలిపింది. ఇతర స్కూళ్లకు మాత్రం క్రిస్మస్ మాత్రమే సెలవు ఇచ్చింది. 
 
ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండుగ సంక్రాంతికి ఆరు రోజులు సెలవులు ప్రకటించింది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఖరారు చేసింది. కాగా, దసరా, బతుకమ్మ కోసం అక్టోబరు 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పాఠశాలలకు 13 రోజుల పాటు సెలవు ప్రకటించారు.