గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: మంగళవారం, 6 మార్చి 2018 (20:06 IST)

వి.హెచ్.ను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ.. ఏంటి సంగతి?

తెలంగాణా యాసలో తనదైన శైలిలో మాట్లాడే వ్యక్తి వి.హనుమంతరావు. ఈయన్నంతా వి.హెచ్ అని పిలుస్తుంటారనుకోండి. కాంగ్రెస్ పార్టీలోని సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోనే మంచి పరిచయాలున్న హనుమంతరావు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. పార్టీ నేతలు కార్యక్రమాలు పెట్టినా ఆయన వెళ

తెలంగాణా యాసలో తనదైన శైలిలో మాట్లాడే వ్యక్తి వి.హనుమంతరావు. ఈయన్నంతా వి.హెచ్ అని పిలుస్తుంటారనుకోండి. కాంగ్రెస్ పార్టీలోని సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోనే మంచి పరిచయాలున్న హనుమంతరావు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. పార్టీ నేతలు కార్యక్రమాలు పెట్టినా ఆయన వెళ్ళాలనుకుంటే వెళతారు. లేకుంటే లేదు. అందుకే వి.హెచ్‌ను కాంగ్రెస్ నేతలు ఎవరూ పిలవరు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
 
అయితే గత కొన్ని నెలలుగా కొన్ని డిబేట్లలో వి.హెచ్.కు ఇబ్బందులు తప్పడం లేదు. డిబేట్‌లలో పాల్గొనే వారి నుంచి బయట ప్రజల నుంచి కూడా వి.హెచ్.కు వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే వి.హెచ్. ప్రస్తుతం సైలెంట్ అయిపోయినట్లు వార్తలొస్తున్నాయి. దాంతోపాటు రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యువ నాయకులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వయస్సు పైబడిన వారిని దూరం పెట్టేస్తున్నారు. దీంతో వి.హెచ్. కూడా మెల్లమెల్లగా బయటకు రావడం మానేస్తున్నారు. 
 
చివరకు వి.హెచ్. ఏకాకి అయిపోయారని ప్రచారం కూడా పెద్దఎత్తున జరుగుతోంది. ఈయన ఒక్కరే కాదు. ఇలా ఎంతోమంది వయస్సు పైబడిన వారిని రాహుల్ పక్కకు పెట్టేస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయట. ఇలా ఒక్కొక్కరిని రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తూ వృద్ధులను కాంగ్రెస్ పార్టీలో నుంచి సాగనంపే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.