Widgets Magazine

ప్రధానిపై సినీ నటి, ఎంపీ దివ్య సెటైర్లు.. రాహుల్ గాంధీ సైలెంట్‌గా వుంటారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సినీ నటి, కాంగ్రెస్ ఎంపీ దివ్య స్పందన ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో జరిగిన ఓ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.

actress ramya
selvi| Last Updated: సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (16:57 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సినీ నటి, కాంగ్రెస్ ఎంపీ స్పందన రమ్య ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో జరిగిన ఓ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... పండ్లు, కూరగాయలును సాగుబడి చేస్తున్న రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. టమోటా, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పండించే సాగుబడి చేసే వారికి ''టాప్'' స్థానం ఇస్తామని మోదీ వ్యాఖ్యానించారు.

మోదీ టాప్‌ను ''POT"గా మార్చిన దివ్య.. మత్తులో మాట్లాడితే వ్యవహారం ఇలానే వుంటుందని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధానిపై సెటైర్లు విసిరిన దివ్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా అంటూ బీజేపీకి చెందిన ఐటీ వింగ్ హెడ్ అమిత్ మాల్వియా ప్రశ్నించారు. ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు సైతం వివిధ కామెంట్లతో స్పందిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :