శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (09:24 IST)

దర్శకుడు చలపతి, హీరో సృజన్ కారులో తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారు...

''అప్పుడు ఇప్పుడు'' పేరుతో సినిమా తీస్తున్నానని, ఆ సినిమాలో అవకాశం ఇస్తానని నమ్మబలికి హైదరాబాదుకు చెందిన చలపతి, హీరో సృజన్ తనపై అత్యాచారానికి యత్నించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. షూటింగ్ స్ప

''అప్పుడు ఇప్పుడు'' పేరుతో సినిమా తీస్తున్నానని, ఆ సినిమాలో అవకాశం ఇస్తానని నమ్మబలికి హైదరాబాదుకు చెందిన చలపతి, హీరో సృజన్ తనపై అత్యాచారానికి యత్నించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్తామని చెప్పి కారులో ఎక్కించుకుని తనపై అఘాయిత్యానికి ప్రయత్నించారని విజయవాడ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన యువతికి సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని చలపతి ఆశలు కల్పించాడు. సినిమా కోసం అని చెప్పి ఆమెను హైదరాబాద్‌కు పిలిపించాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపాడు. అక్కడి నుంచి హీరో సృజన్‌, దర్శకుడు ఒక కారులో, హీరోయిన్‌ మరో కారులో భీమవరానికి బయలుదేరారు.
 
మార్గమధ్యంలో ఆమె కారు ప్రమాదానికి గురికావడంతో చలపతి, సృజన్‌ ఆమెను తమ కారులో ఎక్కించుకున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారిరువురూ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. వారి నుంచి దీంతో ఆమె ఎలాగో తప్పించుకుని విజయవాడ చేరుకుంది. హీరో సృజన్‌, దర్శకుడు చలపతి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, అత్యాచారయత్నం చేశారని ఆమె మంగళవారం రాత్రి విజయవాడలోని పటమట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.