Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''హలో''కు ఓవర్సీస్ రైట్స్‌కి భారీ ఆఫర్: అఖిల్ వాయిస్‌తో ఏవేవో కలలు సాంగ్ (వీడియో)

సోమవారం, 9 అక్టోబరు 2017 (11:18 IST)

Widgets Magazine

అక్కినేని అఖిల్ తొలి సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించకపోవడంతో పాటు ఫ్లాప్ టాక్‌ను కూడా సొంతం చేసుకుంది. దీంతో అఖిల్‌తో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ధైర్యం చేయలేకపోయారు. అయితే అఖిల్‌తో సినిమా చేసేందుకు విక్రమ్ కుమార్ రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబోలో ''హలో'' అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం థియేటర్ రైట్స్‌కి  పోటీ పెరుగుతోంది. అంతేగాకుండా ఓవర్సీస్ రైట్స్‌కి కూడా భారీ ఆఫర్ వచ్చింది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు గాను రూ.ఐదు కోట్లు చెల్లించడానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చినట్టుగా ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
గతంలో అఖిల్ సినిమా నిరాశపరిచినా.. హలో చిత్రానికి అదే స్థాయిలో రేటు రావడానికి దర్శకుడు విక్రమ్ కుమారే కారణమని సినీ పండితులు అంటున్నారు. విక్రమ్ కుమార్ తెరకెక్కించిన రొమాంటిక్ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహా హలో కూడా ప్రేక్షకులకు చేరువవుతుందని వారు చెప్తున్నారు. కాగా ''మనం'' ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పాటను అఖిల్ పాడటం గమనార్హం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవా...? ఎవరాయన? ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ హీరో రెబల్ స్టార్ నట వారసుడిగా సినీరంగప్రవేశం చేశారు ప్రభాస్. తన పెదనాన్న ద్వారా ...

news

పీకల్లోతు ప్రేమలో రత్తాలు.. కొత్త లవర్‌ను పట్టేసింది..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు అంటూ చిందులేసి తెలుగు ...

news

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్బుమణి కావాలి : చారుహాసన్

సినీ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నబంవర్ ...

news

తమన్నా భాటియా లైవ్ చాట్.. తెల్లగా వున్నావని పొగరా?

సినీనటి తమన్నా అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించింది. అయితే ఓ అభిమాని నుంచి అనూహ్య ప్రశ్న ...

Widgets Magazine