Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సమంత నిర్ణయం, పొంగిపోతున్న నాగ్ - అమల.. ఏంటది?

బుధవారం, 27 డిశెంబరు 2017 (21:17 IST)

Widgets Magazine
Samantha-Nagarjuna

మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఆ మాటలను అందాల తార సమంత మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో నిరూపిస్తోంది. చాలామంది తారలు వారికి వచ్చిన డబ్బులో ఎంతో కొంత సమాజ సేవ చేస్తున్నారు. అందులో సమంత మాత్రం చాలా స్పెషల్. తనకు వచ్చిన డబ్బులను అనాధలకు ఇస్తూ వారిని ఆదుకుంటోంది. అక్కినేని ఫ్యామిలీలో పెద్ద కోడలిగా అడుగు పెట్టిన సమంత కుటుంబంలో మంచి పేరునే కొట్టేసింది. 
 
నాగచైతన్యతో పెళ్లయిన తరువాత సమంత జరుపుకున్న మొదటి పండుగ క్రిస్మస్. ఇది ఆమె తొలి పండుగ. అక్కినేని ఇల్లంతా కూడా క్రిస్మస్ స్టార్స్ పెట్టి ఇంటికి కొత్త కళను వచ్చేలా చేసింది. చైతూ కూడా సమంతకు చేదోడు వాదుడుగా ఉంటూ సహాయం చేశాడు. అయితే అదేరోజు నాగార్జున, అమలతో కలిసి కొద్దిసేపు సమంత మాట్లాడారు. 
 
తన వివాహానికి వచ్చిన విలువైన వస్తువులను అమ్మేసి డబ్బులు చేసుకుందామని చెప్పారట సమంత. ఎందుకిలా చేయాలి అని అమల ప్రశ్నించగా ఆ వస్తువులు మనకి గొప్పవి కావచ్చు. వాటిని అమ్మితే కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. దాంతో అనాధలకు సేవ చేద్దాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకుందామని చెప్పిందట. దీంతో నాగార్జున, అమలలు చాలా మంచి ఆలోచన అలాగే చేద్దామంటూ చెప్పారట. త్వరలోనే నాగచైతన్య, సమంతల వివాహానికి సంబంధించిన గిఫ్ట్‌లను విక్రయించనున్నారని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దిల్ రాజు వెంటపడ్డ అనుపమ.. ఎందుకు?

నిర్మాత దిల్ రాజుకు అదృష్టం బాగా కలిసొచ్చినట్లుంది. ఏ సినిమా చేసినా సూపర్ హిట్టే. తను ...

news

అజ్ఞాతవాసి: కొడకా కోటేశ్వర్ రావు పాట టీజర్ (వీడియో)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ పాట పాడారు. ...

news

కోలీవుడ్‌లో ఆఫర్లతో దూసుకెళ్తున్న అర్జున్ రెడ్డి లిప్ లాక్ లవర్స్

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ కొట్టేసిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం యంగ్ ...

news

పారిపోయాననుకున్నారు... వాటికోసమే వెళ్లా... నటుడు విజయ్ భార్య వనిత

హాస్య నటుడు విజయ్ సాయి మరణం వెనుక ఆయన భార్య వనితా రెడ్డి వున్నారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి ...

Widgets Magazine