ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 11 జూన్ 2018 (21:06 IST)

హైపర్ ఆది చేసిన ఆ పనికి యాంకర్ అనసూయ ఆగ్రహం...

జబర్దస్త్ పోగ్రామ్ ఏ స్థాయిలో నడుస్తుందో చెప్పనవసరం లేదు. జబర్దస్త్ కార్యక్రమం వస్తుందంటే చాలు ఇంట్లో ఉన్న మహిళలు ఎగిరి గంతేసి టివీలకు అతుక్కుపోతారు. అస్సలు ఆ సీరియల్ వచ్చే టైంలో ఇక ఎలాంటి పని పెట్టుకోరు కూడా. అయితే ఈమధ్య జబర్దస్త్‌లో కామెడీ స్కిట్ల

జబర్దస్త్ పోగ్రామ్ ఏ స్థాయిలో నడుస్తుందో చెప్పనవసరం లేదు. జబర్దస్త్ కార్యక్రమం వస్తుందంటే చాలు ఇంట్లో ఉన్న మహిళలు ఎగిరి గంతేసి టివీలకు అతుక్కుపోతారు. అస్సలు ఆ సీరియల్ వచ్చే టైంలో ఇక ఎలాంటి పని పెట్టుకోరు కూడా. అయితే ఈమధ్య జబర్దస్త్‌లో కామెడీ స్కిట్ల కన్నా వల్గర్ డైలాగ్‌లే ఎక్కువగా ఉంటున్నాయంటూ మహిళా సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. కొంతమంది అయితే ఏకంగా పోలీసులకు కూడా ఫిర్యాదులు చేశారు. 
 
అయినా సరే జబర్దస్త్‌లో అవి ఆగడం లేదు. ఇదిలా నడుస్తుంటే అనసూయతో హైపర్ ఆది హగ్ చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. స్వర్గాన్ని చూడాలంటే ఏం చెయ్యాలి అంటూ హైపర్ ఆది ఒక ఎపిసోడ్‌లో పంచ్ వేస్తాడు. టీంలోని వారు సమాధానం చెప్పకపోవడంతో అనసూయను హగ్ చేసుకుంటే చాలురా స్వర్గం దానికదే కనిపిస్తుందని అంటాడు.
 
ఒక్క అవకాశం ప్లీజ్ అంటూ అనసూయను కోరతాడు హైపర్ ఆది. దీంతో అనసూయ కూడా ఏమాత్రం ఆలోచించకుండా తను కూర్చున్న ప్లేస్ నుంచి లేచి నిలబడుతుంది. దీంతో హైపర్ ఆది పరుగుత్తుకెళ్ళి అనసూయను హగ్ చేసుకుంటాడు. కొద్దిసేపు పాటు అలాగే పట్టుకుంటాడు. అవకాశం ఇచ్చాము కదా అని హైపర్ ఆది అలా ప్రవర్తించడంతో అనసూయకు చిర్రెత్తుకొచ్చిందట. 
 
కార్యక్రమం అయిపోయి వెళ్ళిపోయిన తరువాత ఫోన్ చేసి హైపర్ ఆదికి క్లాస్ పీకిందట. మనం నటులు మాత్రమే. నటించాలే తప్ప రెచ్చిపోకూడదు. నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అంటూ కోపంతో ఊగిపోయిందట అనసూయ. హైపర్ ఆది ఎంత ప్రాధేయపడినా ఆమె మాత్రం తగ్గలేదట. దీంతో హైపర్ ఆది జబర్దస్త్ షో నిర్వహిస్తున్న శ్యాంప్రసాద్ రెడ్డి ద్వారా అనసూయకు సారీ చెప్పించే ప్రయత్నం చేస్తున్నారట.