శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2017 (11:57 IST)

'సైరా'లో రెండో భార్యగా అనుష్క... మూడో భార్యగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు హీరో రాంచరణ్ తేజ్ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు హీరో రాంచరణ్ తేజ్ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేయగా, ఏఆర్. రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చనున్నారు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌ను, మోస్టల్ పోస్టర్‌ను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు.
 
అయితే, ఈ చిత్ర కథలో చరిత్ర ప్రకారం హీరో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'కి ముగ్గురు భార్యలట. వీరిలో మొదటి భార్య సిద్ధమ్మ కాగా, రెండో భార్య పేరమ్మ. మూడో భార్య ఓబులమ్మ. అయితే, తొలి భార్య సిద్ధమ్మగా నయనతార నటిస్తుందట. రెండో భార్యగా పేరమ్మగా 'దేవసేన' అనుష్కను ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
అయితే, మూడో భార్య ఓబులమ్మగా బాలీవుడ్ యంగ్ బ్యూటీని ఎంపిక చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం చిత్ర యూనిట్ పలువురి పేర్లను ఇప్పటికే పరిశీలించినట్టు టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం. మొత్తమ్మీద 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.