సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 12 జనవరి 2019 (18:46 IST)

అనుష్క సినిమా అమెరికాలోనే... పేరేంటో తెలుసా?

భాగ‌మ‌తి సినిమా త‌ర్వాత అనుష్క ఏ సినిమా చేయ‌నుందో ఇప్ప‌టి వ‌ర‌కు ఎనౌన్స్ చేయ‌లేదు. కానీ... ఇటీవ‌ల అనుష్క సైలెన్స్ అనే సినిమా చేయ‌నుంది అనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. కోన ఫిల్మ్ కార్పోరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించ‌నున్నాయి. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమా అమెరికాలో షూటింగ్ జ‌రుపుకోనుంది. 
 
ఇలా వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి కానీ... అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. అయితే... స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్లో ఫాలోవ‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతూ.... ఈ సినిమా మార్చిలో ప్రారంభం కానుంద‌ని చెప్పారు. ఎక్కువ భాగం షూటింగ్ అమెరికాలోనే ఉంటుంద‌ట‌. అనుష్క మూగ అమ్మాయిగా న‌టించ‌నుంది అనే టాక్ వినిపిస్తోంది నిజ‌మేనా? అని అడిగితే... అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసేవర‌కు ఏమీ న‌మ్మ‌ద్దు అన్నారు. ఈ సంవ‌త్స‌రంలోనే రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అదీ.. సంగ‌తి..!